The people of the Telugu states who are going to the Gulf countries for the Subsistence, are having trouble. The people of the Telugu states who are going to Saudi are going to hell.They are having trouble there.
#telugustates
#saudi
#Gulfcountries
#Telangana
#andrapradesh
#kcr
#ktr
#shushmaswaraj
#bjp
పొట్ట చేత పట్టుకుని సౌదీకి వెళ్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు నరకాన్ని చవిచూస్తున్నారు . అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో తెలుగు వారి పరిస్థితి రోజురోజుకీ మరింత దయనీయంగా తయారవుతుంది. ఉన్న ఊరు కలిసిరాక, కరవు రక్కసి కాటేసిన చాలా ప్రాంతాల ప్రజలు గల్ఫ్ దేశాల్లో పొట్ట పోసుకునేందుకు వెళుతున్నారు. అక్కడ వర్కింగ్ వీసా మీద వెళ్ళినా వారిని తీసుకెళ్ళిన ఏజెంట్లు , కంపెనీల మోసం కారణంగా వందల మంది వర్క్ పర్మిట్ రెన్యువల్ కాక ప్రభుత్వానికి జరిమానా కట్టలేక అక్కడ బందీలుగా మారుతున్నారు. ప్రస్తుతం సౌదీలో ఒకే గదిలో సంవత్సర కాలంగా బందీలుగా ఉన్న 30 మంది కార్మికుల దీన గాధ ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తున్నా తమవారి కోసం పట్టించుకునే నాధుడి కోసం ఆ తెలంగాణా కార్మికుల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి.